Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కొత్తగా వందే మెట్రో సర్వీసులు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన..ఎక్కడెక్కడ వస్తాయంటే?

భారతీయ రైల్వేకు కేంద్రం ఈసారి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు జరిపిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో బడ్జెట్‌ కేటాయించిన నేపథ్యంలో ఇంత మొత్తం వేటి కోసం వెచ్చించనున్నారన్న చర్చ మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత.. మీడియాతో మాట్లాడారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ఈ నేపథ్యంలోనే ఒక కీలక ప్రకటన చేశారు. భారతీయ రైల్వే త్వరలో వందే మెట్రో సర్వీసులను లాంఛ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. వందే భారత్‌ ట్రైన్ల తరహాలోనే ఇవి దేశవ్యాప్తంగా నడవనున్నట్లు వెల్లడిరచారు.అయితే ఈ వందే మెట్రో అంటే ఏంటి? అనే ప్రశ్న చాలా మందికి కలిగింది. ఈ నేపథ్యంలోనే దీని గురించి తెలుసుకుందాం. వందే మెట్రో.. అంటే ప్రస్తుతం పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన వందే భారత్‌ ట్రైన్లకు మినీ వెర్షన్‌ అన్నమాట. ఇవి పెద్ద పెద్ద నగరాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం తీసుకొస్తున్నట్లు వెల్లడిరచారు రైల్వే మంత్రి. ఇవి ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే రైల్వే శాఖ ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వెర్షన్‌ వందే భారత్‌ ట్రైన్ల తయారీలో నిమగ్నమై ఉంది.ముఖ్యంగా నగరాలకు ఆనుకుని ఉన్న ప్రాంత ప్రజలు.. అక్కడికి ఉద్యోగ నిమిత్తం, ఇతర పనుల కోసం వస్తుంటారని, వారి ప్రయాణాన్ని, రాకపోకలను సులభతరం చేయడం కోసం వందే మెట్రో సర్వీసుల్ని తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించినట్లు అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు, వ్యాపారులు, పర్యటకులు ఇలాంటి వారి కోసం వందే మెట్రో సర్వీసులు బాగా ఉపయోగపడతాయని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img