Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.శనివారం సభ కొలువుదీరగానే తొలుత అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టారు. అనంతరం ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ చట్టాలు దేశంలో వ్యవసాయ వృద్ధికి లేదా రైతులకు సహాయపడవని చెప్పారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం వాటిని ఏకపక్షంగా ఆమోదించిందన్నారు. రైతులు చేస్తున్న శాంతియుత ఆందోళనలకు మద్దతుగా ఈ తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, గత ఏడాదిగా ఆందోళన చేస్తున్న రైతులపై దాఖలైన అన్ని రకాల కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ, అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img