Friday, April 19, 2024
Friday, April 19, 2024

కొవిడ్‌ రోగుల కోసం మమత సర్కార్‌ పండ్లబుట్ట

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం కొవిడ్‌ రోగుల కోసం పండ్ల బుట్టను అందిస్తోంది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నుంచి పండ్ల బుట్టతోపాటు ‘కరోనా నుంచి మీరు త్వరగా కోలుకోండి’ అనే సందేశాన్ని పంపిస్తున్నారు..ఇప్పటివరకు 10వేల మందికి పండ్ల బుట్టలను సిద్ధం చేసి. కోల్‌కతా నగరం అంతటా కరోనా రోగులకు పంపిణీ ప్రారంభించారు. ఈ పనిని కౌన్సిలర్లకు అప్పగించగా..వారు కరోనా రోగుల ఇళ్లకు పంపిస్తున్నారు. ొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్‌ జోన్లలో పండ్ల బుట్టలను భవనం బయట పెట్టి నివాసితులకు ఫోనులో సమాచారం అందిస్తున్నారు.పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో 403 కొవిడ్‌ కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 23.17 శాతం ఉంది. కరోనా రోగుల కోసం 19,517 బెడ్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 2,075 మంది కొవిడ్‌ రోగులు ఆసుపత్రుల్లో చేరారని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img