Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి ఆలస్యం


భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్‌ కొవిడ్‌ టీకాకు రావాల్సిన అత్యవసర వినియోగ అనుమతి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతికరపరమైన అంశాలపై భారత్‌ బయోటెక్‌ నుంచి డబ్ల్యూహెచ్‌వో సమాధానాలు ఆశిస్తోంది. ఈ జాప్యం వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు చేసే విద్యార్థులకు మరి కొంత కాలం పాటు నిరీక్షణ తప్పేలా లేదు. అత్యవసర వినియోగ అనుమతి దక్కకపోవడం వల్ల అనేక దేశాలు కోవాగ్జిన్‌ టీకాను గుర్తించడంలేదు.కాగా టీకాకు చెందిన అన్ని రకాల డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించినట్లు భారత్‌ బయోటెక్‌ పేరొంది. కోవాగ్జిన్‌ మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా ప్రకారం ఆ వ్యాక్సిన్‌ 77.8 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img