Friday, April 19, 2024
Friday, April 19, 2024

కరోనా పరిహారం కోసం ఇంతలా అక్రమాలా?

సుప్రీంకోర్టు ఆవేదన
అవసరమైతే కాగ్‌తో దర్యాప్తు

న్యూదిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు అందించే రూ.50వేల పరిహారం పొందేందుకు కొందరు నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పథకాలు కూడా దుర్వినియోగం అవుతాయని అనుకోలేదని, నైతిక విలువలు ఇంతలా దిగజారాయని ఊహించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిరది. ఇదే విషయంపై అవసరమైతే కాగ్‌ దర్యాప్తునకు ఆదేశిస్తామని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్‌`19 పరిహారాన్ని పొందేందుకు వీలుగా కొంతమంది నకిలీ ధ్రువపత్రాలను జారీ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. దీని వెనుక ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉంటే తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ… కోవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేతకు ఒక నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించాలన్న ప్రతిపాదనను ధర్మాసనం పరిశీలించాలని కోరారు. ఇలా చేస్తే నిజమైన అర్హులు గడువు మేరకు దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను మార్చి 21కి వాయిదా వేసింది. కోవిడ్‌-19 మృతుల కుటుంబాలకు సజావుగా పరిహారం అందేలా నోడల్‌ అధికారులను నియమించి పర్యవేక్షించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img