Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఖాళీల భర్తీకి చర్యలు: హోంశాఖ

న్యూదిల్లీ: రానున్న ఏడాదిన్నర కాలంలో అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల మందిని నియమించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచనలకు అనుగుణంగా వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం తెలిపింది. ‘1.5 సంవత్సరాల వ్యవధిలో అన్ని ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో 10 లక్షల నియామకాలు చేపట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచనలకు అనుగుణంగా, హోంమంత్రిత్వ శాఖ మిషన్‌ మోడ్‌లో ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు ప్రారంభించింది’ అని ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రధాని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారని, ఇది ఉపాధి దృష్టాంతాన్ని మరింత బలోపేతం చేస్తుందని, భారతీయ యువతలో ఉల్లాసాన్ని, ఆశావాదాన్ని తీసుకువస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img