కోవిడ్ వ్యాక్సిన్ టీకాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా స్వదేశీ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తికి మరో కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుజరాత్లోని అంకలేశ్వర్లో కోవాగ్జిన్ టీకా ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడిరచారు.గతంలో కేవలం హైదరాబాద్ యూనిట్ నుంచి మాత్రమే కోవాగ్జిన్ ఉత్పత్తి జరిగేది. ఇక నుంచి అంకలేశ్వర్ యూనిట్ నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభించనున్నది. జనవరి నుంచి ఆగస్టు వరకు 7 కోట్ల టీకా డోసులను భారత్బయోటెక్ ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే.