Friday, April 19, 2024
Friday, April 19, 2024

గూగుల్‌కి రాజీనామా చేసిన అర్చనా గులాటీ

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఐదు నెలల క్రితం గూగుల్‌ లో చేరారు అర్చనా గులాటీ. కాగా గూగుల్‌ ఇండియా గవర్నమెంట్‌ అఫైర్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌ పదవికి అర్చనా గులాటీ రాజీనామా చేశారు. నీతి ఆయోగ్‌ జాయింట్‌ సెక్రటరీ (డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌) ఉద్యోగానికి రాజీనామా చేసి గూగుల్‌ లో పాలసీ హెడ్‌ గా బాధ్యతలను స్వీకరించారు. ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన అర్చన ఐఐటీ ఢల్లీి నుంచి పీహెచ్‌ డీ చేశారు. అయితే గూగుల్‌ కు ఆమె ఎందుకు రాజీనామా చేశారనే కారణం మాత్రం తెలియరాలేదు. ఈ అంశంపై అర్చన కానీ, గూగుల్‌ ఇండియా కానీ ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మీడియా వారిని కాంటాక్ట్‌ చేసినప్పటికీ%ౌౌ% స్పందించేందుకు తిరస్కరించారు. ఇండియాలో యాంటీ ట్రస్టు కేసులతో పాటు టెక్‌ సెక్టార్‌ రెగ్యులేషన్స్‌ కు సంబంధించిన సమస్యలను గూగుల్‌ ఎదుర్కొంటున్న సమయంలో అర్చన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img