Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గెంటేవరకూ పార్టీలోనే ఉంటా

మనీష్‌ తివారీ
న్యూదిల్లీ : తనను ఎవరైనా బయటకు నెట్టివేసేవరకూ తాను కాంగ్రస్‌ పార్టీని విడిచిపెట్టనని ఆ పార్టీ సీనియర్‌ నేత, జాతీయ ప్రతినిధి మనీష్‌ తివారీ గురువారం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తాను కిరాయిదారును కాదని, పార్టీలో భాగస్వామినని గత నాలుగు దశాబ్ధాలుగా పార్టీలో పనిచేస్తున్నానని స్పష్టంచేశారు.
మనీష్‌ తివారీ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథó్యంలో మనీష్‌ తివారీ తాజాగా తాను పార్టీని వీడేది లేదని ట్వీట్‌ చేశారు. తాను బాహాటంగా నోరుమెదిపితే తిరుగుబాటుగా పరిగణిస్తున్నారనీ, మౌనం దాల్చితే తాను నిస్సహాయిడిగా మిగిలిపోతానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పంజాబ్‌లో పంజాయత్‌ ఆజ్‌ తక్‌ కార్యక్రమంలో తివారీ మాట్లాడుతూ దిగువ శ్రేణి పార్టీ కార్యకర్త వైదొలగినా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందనీ, సీనియర్‌ నేత వైదొలగితే పార్టీపై అది పెనుప్రభావం చూపుతుందని అన్నారు. ఇక గత ఏడాది డిసెంబరులో ఉత్తరాఖండ్‌ పార్టీలో తలెత్తిన వివాదాన్ని అసోం, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎదురైన సంక్షోభంతో మనీష్‌ తివారీ పోల్చడంతో కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img