Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గెలిపిస్తే ఉమ్మడి పౌరస్మృతిపై కమిటీ

ఉత్తరాఖండ్‌ సీఎం ధామి ప్రకటన
డెహ్రాడూన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ మళ్లీ వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే…ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా రూపొందించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి శనివారం హామీ ఇచ్చారు. న్యాయనిపుణులు, పదవీ విరమణ చేసిన ప్రముఖులు, మేధావులు, ఇతర భాగస్వాములను కమిటీలో సభ్యులుగా చేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ధామి ఈ ప్రకటన చేశారు. వివాహం, విడాకులు, ఆస్తులు, ఇతర అంశాలన్నింటినీ కమిటీ పరిధిలోకి తెస్తామని ఓ వీడియో ప్రకటన చేశారు. ‘భారత రాజ్యాంగ నిర్మాతల కలలు పరిపూర్తి చేసేందుకు ఇదో ముఖ్యమైన ముందడుగు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 ప్రకారం మతాలతో సంబంధం లేకుండా సమాజంలోని పౌరులందరికీ సమాన చట్టం వర్తింప చేయాలన్నదే మా లక్ష్యం’ అని ధామి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు సైతం ఎప్పటికప్పుడు ఉమ్మది పౌరస్మృతి ఆవశ్యకతను ఉద్ఘాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చిందని పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే: సిబల్‌
ఉమ్మడి పౌరస్మృతిపై సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు. ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందుతుందనడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమని సిబల్‌ పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటే మంచిదని సీఎం ధామికి హితవు పలికారు. నిరాశ, నిస్పృహలతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఓటమి ఖాయమని సిబల్‌ స్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img