Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఘోర ప్రమాదం : ఢీకొన్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు..8 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రెండు డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. 16 మంది వరకు గాయపడ్డారు. కత్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నారాయణ్‌పుర్‌ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్‌ బస్సులు బిహార్‌ నుంచి దిల్లీకి వెళుతుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను లఖ్‌నవూ ట్రామా సెంటర్‌కు తరలించారు. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటాబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికాలుకు ఆదేశించారు.
హిమాచల్‌ ప్రదేశ్‌లో
మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో కారు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.క్షతగాత్రులను చికిత్స కోసం చంబా మెడికల్‌ కాలేజీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.కారు వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లోయ ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు కోరుతున్నారు. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img