Friday, April 19, 2024
Friday, April 19, 2024

చక్కెర ఎగుమతులపై ఆంక్షలు..ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం

వచ్చే ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ వరకూ చక్కెర ఎగుమతులపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశవాళీ మార్కెట్‌లో చక్కెర అందుబాటులో ఉండేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. ఇంతకుముందు చక్కెర ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీతో ముగియనుండటంతో ఆ ఆంక్షలను కేంద్రం తాజాగా పొడిగించింది.న్యూఢల్లీి: చక్కెర ఎగుమతులపై ఆంక్షలను వచ్చే ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశవాళీ మార్కెట్‌లో చక్కెర అందుబాటులో ఉండేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. ఇంతకుముందు చక్కెర ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీతో ముగియనుండటంతో ఆ ఆంక్షలను కేంద్రం తాజాగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, తక్కిన షరతుల్లో ఎలా%ఞ%టి మార్పు లేదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ శనివారంనాడు ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే, ఈయూ, యూఎస్‌లకు సీఎక్స్‌ఎల్‌, టీఆర్‌క్యూ డ్యూటీ కన్షెషన్‌ కోటాలపై మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది. చక్కెర అత్యధికంగా ఉత్పత్తి దేశాల్లో ఒకటైన భారతదేశం, ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచ అతిపెద్ద ఎగుమతిదారుల్లో రెండో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img