Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చర్యలు తీసుకోవాలి : ఎంపీ విశ్వం

న్యూదిల్లీ : ప్రవక్త మహమ్మద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మకు ఎర్ర తివాచీ పరిచి బాధితుల హక్కుల కోసం పోరాడే కార్యకర్తలు తీస్తా సెతల్వాడ్‌, శ్రీకుమార్‌ను జైలుకు పంపడం ఎంత వరకు సమంజసమని సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం ప్రశ్నించారు. ఆమె వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలను స్వాగతించారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరవాలని, పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. ఏదేని రాజకీయ పార్టీ అధికార ప్రతినిధికి మతోన్మాదంతో కూడిన నిర్లక్ష్య వైఖరి హాల్‌మార్కు కాకూడదన్నారు. ఇటువంటి వారి వల్లే ఉదయ్‌పూర్‌ తరహా ఘటనలు చోటుచేసుకుంటాయని, వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఇటువంటి వారు దేశానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ట్వీట్‌ చేశారు. బీజేపీ, ఆ పార్టీ నేతలు విద్వేషాన్ని ప్రోత్సహిస్తుండటంతో దేశాన్ని ప్రమాదంలోని నెట్టివేస్తున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఇటువంటి విద్రోహవిభజిత చర్యలకు పూనుకోబోమని బీజేపీ ప్రతిజ్ఞ బూనాలని నొక్కిచెప్పారు. ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నుపుర్‌ శర్మ వ్యవహారంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఏచూరీ ట్వీట్‌ చేశారు. దేశంలో చోటుచేసుకుంటున్న హింసకు నూపుర్‌ శర్మ కారణమని సుప్రీంకోర్టు భావిస్తే ఆమెపై చట్ట ప్రకారం చర్యలను తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి రావడంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిందని, చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే ఆమె లాంటి మరికొందరు నోరు పారేసుకుంటారు. బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేష ఫ్యాక్టరీల నుంచి ఇంకొందరు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. ఆల్ట్‌న్యూస్‌ సహవ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌ చిన్న కారణానికి జైలు పాలు కావడాన్ని ఖండిరచారు. నిజాన్ని నిర్థారించే జుబేర్‌ వంటి జర్నలిస్టు జైలులో ఉండరాదు.. మరింత నిబద్ధతతో పనిచేయాలన్న ప్రోత్సాహం లభించాలి అని ఏచూరీ అన్నారు. నూపుర్‌ శర్మ విద్వేషపూరిత ప్రసంగాన్ని బహిర్గతం చేసినందుకే బీజేపీ పరిధిలోని పోలీసులు ఆయనను జైలుకు పంపారన్నారు. సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య కూడా స్పందిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విజభన వైఖరికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అద్దం పట్టాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img