Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చార్‌ధామ్‌ యాత్రపై ‘స్టే’ ఎత్తివేత

పరిమిత సంఖ్యలో యాత్రికులకు అనుమతి
నైనిటాల్‌ : ఉత్తరాఖండ్‌ హైకోర్టు గురువారం చార్‌ధామ్‌ యాత్రపై స్టేను ఎత్తివేసింది. యాత్రీకులు కోవిడ్‌`19 నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాత్రపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని, సంబంధిత ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితి వంటి ఆంక్షలతో యాత్ర ప్రారంభమవుతుందని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ వర్మలతో కూడిన కోర్టు డివిజన్‌ బెంచ్‌ వెల్లడిరచింది. యాత్రీకులు నెగటివ్‌ కోవిడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌, టీకా వేయించుకున్న సర్టిఫికేట్‌ కలిగియుండటం తప్పనిసరని కోర్టు తెలిపింది. కేదార్‌నాథ్‌ ధామ్‌లో రోజుకు 800, బద్రీనాథ్‌ ధామ్‌లో 1200, గంగోత్రిలో 600, యమునోత్రిలో 400 మంది భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొంది. కాగా సదరు ఆలయాల చుట్టూ ఉన్న ఏ నీటి గుండాల్లోనూ స్నానానికి భక్తులను అనుమతించరు. చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించి చమోలి, రుద్రప్రయాగ్‌, ఉత్తరకాశి జిల్లాలలో అవసరాలకు అనుగుణంగా పోలీసు బలగాలు మోహరిస్తారు.
కోవిడ్‌ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నందున, దేవాలయాలు ఉన్న చమోలి, రుద్రప్రయాగ్‌ , ఉత్తరకాశి జిల్లాల నివాసితుల కోసం చార్‌ధామ్‌ యాత్రను పరిమితంగా ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై కోర్టు జూన్‌ 28 న స్టే విధించిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img