Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు

14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

న్యూదిల్లీ : పిల్లలపై లైంగిక వేధింపులు, వెబ్‌ సైట్లలో పోస్టులు చేయడం, ప్రసారం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 83 మందిపై సీబీఐ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మంగళవారం 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో సమన్వయ శోధన ఆపరేషన్‌ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 83 మందిపై ఈనెల 14న 23 వేర్వేరు కేసులను నమోదు చేసినట్లు వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌, దిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, బీహార్‌, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఈ సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌.సి.జోషి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img