Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చిరుప్రాయంలో బలవన్మరణాలు

24 వేల మందికిపైగా పిల్లల ఆత్మహత్య
2017`2019 మధ్య కాలంలో విషాద ఘటనలు
ఎన్‌సీఆర్‌బీ వెల్లడి

న్యూదిల్లీ : చిరుప్రాయంలోనే పసి మొగ్గలు రాలి పోతున్నాయి. తెలిసీతెలియని వయస్సులో పిల్లలు బలవన్మరణం చెందుతున్నారు. 20172019 కాలంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన 24 వేల మందికి పైగా చిన్నారులు ప్రాణాలు తీసుకున్న విషాద ఘటనలు నమోద య్యాయి. వాటిలో 4 వేలకు పైగా కేసుల్లో పరీక్షల్లో వైఫల్యమే కారణంగా కనిపిస్తోందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. చిన్నారుల ఆత్మహత్యలపై జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)కు చెందిన ఏకీకృత డేటా ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టబడిరది. 2017 2019 మధ్య కాలంలో 1418 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 13,325 బాలికలు సహా 24,568 మందికి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించింది. 2017లో ఇదే వయస్సు వారు 8,029 మందికి పైగా బలవ న్మరణం పొందారు. 2018లో ఈ సంఖ్య 8,162కు పెరిగింది. ఇక 2019లో 8,377కు చేరినట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్లడిరచింది. కాగా ఈ వయస్సులో పిల్లల్లో అత్యధికంగా ఆత్మహత్యలు మధ్యప్రదేశ్‌లో 3,115, పశ్చిమ బెంగాల్‌లో 2,802, మహారాష్ట్రలో 2,527, తమిళనాడులో 2,035 సంభవించాయి. 4,046 మంది చిన్నా రుల ఆత్మహత్యకు పరీక్షలో వైఫల్యమే కారణమని వెల్లడయ్యింది. 411 మంది బాలికలతో సహా 639 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహానికి సంబంధించిన సమస్య కారణమని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. ఇక ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కారణాల వల్ల దాదాపు 3,315 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. 2,567 మంది పిల్లల ఆత్మహత్య వెనుక అనారోగ్యం కారణంగా ఉంది. 81 మంది పిల్లల మరణానికి శారీరక హింస కారణం. ప్రియమైన వ్యక్తి మరణం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేదా మద్య వ్యసనం, చట్టవిరుద్ధమైన గర్భం, సామాజిక ఖ్యాతి తగ్గడం, నిరుద్యోగం, పేదరికం, సైద్ధాంతిక కారణాలు లేదా హీరో ఆరాధన ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి ఇతర కారణాలుగా ఉన్నాయి. కొవిడ్‌19 మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, పాఠశాల పాఠ్యాంశాలలో జీవిత నైపుణ్య శిక్షణను చేర్చడం, ప్రధాన ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య అజెండాలో మానసిక ఆరోగ్యాన్ని చేర్చాలని బాలల హక్కుల కార్యకర్తల పాలకులను హెచ్చ రించారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి సమ యంలో పిల్లల మానసిక-సామాజిక శ్రేయస్సు ఎలా ఉంటుందనే దానిపై క్రై`చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు సీఈవో పూజ మర్వాహా వ్యాఖ్యానిస్తూ, ఆత్మహత్యకు ప్రయత్నించే మెజారిటీ పిల్లలు, కౌమారదశలో గణనీయమైన మానసిక ఆరోగ్య సమస్య ఒక సవాలుగా ఉందని అన్నారు. ‘చిన్న పిల్లల్లో ఆత్మహత్య ప్రయత్నాలు తరచుగా హఠాత్తుగా ఉంటాయి. అవి బాధ, గందరగోళం, కోపం, ఒత్తిడి లేదా శ్రద్ధ, హైపర్‌యాక్టివిటీ సమస్యలతో ముడిపడి ఉండవచ్చు. ఇక టీనేజర్లలో ఆత్మ హత్యా యత్నాలు ఒత్తిడి, విజయం సాధిస్తామో లేదోనన్న భయం, ఆర్థిక అనిశ్చితి, నిరాశ, నష్టంతో ముడిపడి ఉంటాయి. కొంత మంది టీనేజర్లకు ఆత్మహత్య అనేది వారి సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తుంది’ అని ఆమె చెప్పారు. ‘పిల్లలు, యుక్త వయస్కు లందరికీ నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణ, మానసిక-సామాజిక మద్దతు యంత్రాం గాలపై హక్కు ఉందని మేము విశ్వసిస్తున్నాము. పిల్లలు, టీనేజర్లతో వ్యవహ రించడంలో సహాయపడటానికి ప్రభుత్వం, పౌర సమాజం, కమ్యూనిటీలు, కుటుం బాలు ముందుకు రావాలి. పిల్లలకు సహాయ పడటానికి పాఠ్యాంశాలలో జీవన నైపుణ్య శిక్షణ చేర్చడం సహా పునరావాస సేవలు, చికిత్స, థెరపీ కోసం ఒక బలమైన యంత్రాం గాన్ని అందిం చడంలో సహకరించాలని మేము కోరుతున్నాము’ అని మర్వాహా తెలిపారు. సెంటర్‌ ఫర్‌ అడ్వకేసీ అండ్‌ రీసెర్చ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అఖిల శివదాస్‌ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభంలో రూపుదిద్దుకున్న కౌమారదశ, జీవిత నైపుణ్య విద్య కార్యక్రమం హెచ్చుతగ్గులకు లోనవుతోందని చెప్పారు. ‘అనేక జీవిత సవాళ్లు, ఇబ్బందులను ఎదుర్కోవటానికి యువతను ఎలా తయారు చేయాలి. నడిపిం చాలనే దానిపై స్పష్టత, ఏకాభిప్రా యం, విశ్వాసం ఎన్నడూ లేవు’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img