Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తిరిగి తీసుకొస్తాం

పీడీఎఫ్‌ అధినేత్రి మెహబూబా ముఫ్తీ
జమ్మూకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370ని తిరిగి పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీఎఫ్‌ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ మాజీ నేత గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. కశ్మీర్‌ కు ప్రత్యేక హోదా తిరిగి తేవడం సాధ్యం కాదని ఆజాద్‌ అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370ని తిరిగి తేవాలంటే కాంగ్రెస్‌ కు పార్లమెంటులో మూడిరట రెండొంతుల మెజారిటీ కావాలని, అది తన జీవితకాలంలో కశ్మీర్‌ కు రాదని ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై ముఫ్తీ స్పందించారు. ‘ఇది ఆజాద్‌ వ్యక్తిగత అభిప్రాయం. జమ్మూకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరించబడుతుందని దృఢంగా విశ్వసించే స్వరాలు ఉన్నాయి. అందులో నేను కూడా ఉన్నా. ఆర్టికల్‌ 370ని తొలగించడం సమస్యను మరింత క్లిష్టతరం చేసిందని నేను భావిస్తున్నాను. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్‌.. వారి దురాగతాలను అంతం చేసింది. అదేవిధంగా జమ్మూకశ్మీర్‌లో ఇటువంటి అనేక స్వరాలు ఉన్నాయి. మేము ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించడమే కాకుండా ఈ వివాదాన్ని కూడా పరిష్కరిస్తాము అని గట్టిగా విశ్వసిస్తున్నాము’ అని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img