Friday, April 26, 2024
Friday, April 26, 2024

జూన్‌లో 22లక్షల అకౌంట్లను బ్యాన్‌ చేసిన వాట్సాప్‌

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన మెసేజింగ్‌ సేవ సంస్థ, ఇన్‌ స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ ఫారమ్‌ వాట్సాప్‌ జూన్‌ నెలలో చాలా మంది భారతీయులకు షాకిచ్చింది. దాదాపు జూన్‌ నెలలో 22 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడిరచింది. వాట్సాప్‌ ప్రతి నెల కొత్త ఐటీ నిబంధనల మేరకు నివేదికలను విడుదల చేస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన జూన్‌ నెల నివేదికలో యాప్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అందుకు దాదాపు 22 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్‌ బ్యాన్‌ చేసినట్టు ప్రకటించింది.
నివేదిక ప్రకారం, వాట్సాప్‌ ప్లాట్‌ఫారమ్‌ 1 జూన్‌ 2022 మరియు 30 జూన్‌ 2022 మధ్య 22,10,000 చెడు ఖాతాలను నిషేధించింది. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, ధ్రువీకరించిన సందేశాలను ఫార్వర్డ్‌ చేసే వినియోగదారుల ఖాతాలను వాట్సాప్‌ బ్యాన్‌ చేస్తున్నట్లుగా వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img