Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలు..

ఇకపై 12 గంటలు పనిచేయాల్సిందే !
దేశవ్యాప్తంగా కొత్త కార్మిక చట్టాలను వచ్చే నెల 1 (జులై 1) నుంచి అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చట్టాల అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, భవిష్య నిధితో పాటు పనిగంటల సహా తదితర అంశాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ఈ నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడిరచింది. వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు ఈ చట్టాల ద్వారా సాధించాలని కేంద్రం భావిస్తోంది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే అధికారిక పనిగంటలు పెరుగుతాయి. ప్రస్తుతమున్న 8-9 గంటలకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఓటీ సమయం 50 నుంచి 150 గంటలకు పెరుగుతుంది. భవిష్య నిధిలో కార్మికుడు, యజమాని జమచేసే వాటా కూడా పెరుగుతుంది. గ్రాస్‌ వేతనంలో 50 శాతం బేసిక్‌ ఉండాలి. దానివల్ల పీఎఫ్‌కి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది. యజమాని కూడా అంతే స్థాయిలో జమ చేయాల్సి ఉంటుంది. తద్వారా రిటర్మెంట్‌ తర్వాత అందుకునే మొత్తం, గ్రాట్యుటీ పెరుగుతాయి. దీని వల్ల పదవీవిరమణ తర్వాత ఉద్యోగులకు ఇబ్బందిలేకుండా జీవించవచ్చు. ప్రస్తుతం ఏడాదిలో 240 దినాలు పనిచేస్తే ఆర్జిత సెలవులకు అర్హత లభిస్తుండగా.. కొత్త చట్టాలతో దానిని 180 రోజులకు కుదిస్తారు. అదే సమయంలో ప్రతి 20 రోజుల పనిదినాలకు కార్మికులు తీసుకునే ఒకరోజు సెలవులో మార్పులేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత దేశంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు డిమాండ్‌ ఏర్పడటంతో దానికి కూడా కొత్త చట్టాలతో చట్టబద్ధత లభిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు అనుగుణంగా ఇప్పటి వరకూ 23 రాష్ట్రాలు కార్మిక నిబంధనలు రూపొందించాయి. మిగతా ఏడు రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో ముందుకెళ్లలేదు. రాష్ట్రాల రూపొందించిన నిబంధనలను పార్లమెంట్‌ ఆమోదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img