Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జైలులో నిమ్మకాయల కుంభకోణం

అధికారిపై వేటు
చంఢీగడ్‌: పంజాబ్‌లోని కపుర్తలా మాడ్రన్‌ జైలులో నిమ్మకాయల కుంభకోణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆ జైలు ఆఫీసర్‌పై అధికారులు వేటు వేశారు. ఖైదీల ఆహారం కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు జైలర్‌ గుర్నామ్‌ లాల్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. జైలు రికార్డుల్లో 50 కిలోల నిమ్మకాయలు కొన్నట్లు ఉన్నా.. ఆ జైలులో ఉంటున్న ఖైదీలు మాత్రం తమకు నిమ్మకాయలు అందడం లేదని తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా నిమ్మకాయలకు డిమాండ్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఒక దశలో కిలో రూ.500కు అమ్మారు. అయితే ఖైదీ మెనూలో నిమ్మకాయలను కలపడంతో ఈ వివాదం తెరమీదకు వచ్చింది. తనిఖీ కోసం వెళ్లిన అధికారులు కంగుతిన్నారు. తమకు ఇవ్వాల్సిన రేషన్‌లో నిమ్మకాయలు లేవని ఆ జైలులో ఉన్న ఖైదీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. జైళ్ల శాఖ మంత్రి హర్జోత్‌ సింగ్‌ బెయిన్స్‌ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో జైలర్‌ గుర్నామ్‌ లాల్‌ను సస్పెండ్‌ చేశారు. ఒక్కొక్క చపాతి బరువు కూడా 50 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూరగాయల కొనుగోలులోనూ అక్రమాలు జరిగినట్లు పసికట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img