Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘జైల్లో ఉన్న జర్నలిస్టు కుమార్తెను నేను…’

తొమ్మిదేళ్ల చిన్నారి స్పీచ్‌ వైరల్‌
స్వాతంత్ర దినోత్సవం రోజున స్కూల్లో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి స్పీచ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఇంత చిన్న వయస్సులోనే సాధారణ పౌరుల స్వేచ్ఛను హరించరాదని ఆమె తన ప్రసంగంలో చెప్పింది. ‘‘భారత పౌరులకు లభించే ప్రాథమిక పౌర హక్కులను తిరస్కరించడంతో జైల్లో మగ్గుతున్న జర్నలిస్టు కుమార్తెను నేను’’ అని చిన్నారి మెహనాజ్‌ కప్పన్‌ సోమవారం పాఠశాలలో తన ప్రసంగాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు నిమిషాలు తన స్పీచ్‌లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడిరది. ఆ బాలిక ఎవరో కాదు.. హత్రాస్‌ కుట్ర కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసుపై అరెస్టైన మలయాళీ జర్నలిస్టు సిద్ధిక్‌ కప్పన్‌ కుమార్తె. ఇప్పుడు ఆమె ప్రసంగమే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.భారతీయుల స్వేచ్ఛను హరించకూడదని ఆ చిన్నారి సూచించింది. ప్రతి భారతీయుడికి తమకు నచ్చని దానిని వ్యతిరేకించే హక్కు, ఎదిరించే హక్కు ఉందని తెలిపింది. అలాగే ఏం తినాలో, ఏం మతాన్ని అవలంభించాలో నిర్ణయించుకునే అధికారం అందరికి ఉందని, ఓ భారతీయురాలుగా చెబుతున్నానని తెలిపింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రమని చెప్పింది. అంతేకాదు దేశంలో అశాంతి నెలకొందని, మతం, లింగం వంటి రాజకీయాల ప్రాతిపదికన హింస సాగుతుందని చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల్లో ప్రేమ, ఐక్యతా భావాలు పెరగాలని సూచించింది. ఎంతటి ఉపద్రవాన్నైనా తుడిచిపెట్టెయాలని, భారత దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లెందుకు కృషి చేయాలని, ఎలాంటి విభేదాలు లేని రేపటి కోసం కలలు కనాలని చెప్పింది.ఈ చిన్నారి స్పీచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img