Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జేజే ఆస్పత్రి ప్రాంగణంలో బయటపడిన బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బ్రిటీష్‌ కాలం నాటి సొరంగం బయటపడిరది. జేజే ఆస్పత్రి ప్రాంగణంలో దీనిని గుర్తించారు. ఆస్పత్రిలో కొన్ని చోట్ల నీరు లీక్‌ అవుతుంది. ఆ నీటి లీకేజీని అడ్డుకట్ట వేసేందుకు తవ్వకాలు జరుపుతుండగా ఈ రహస్య సొరంగం బయటపడిరది. ముంబైలోని ఈ గ్రాంట్‌ మెడికల్‌ కాలేజ్‌, సర్‌ జేజే గ్రూప్‌ హాస్పిటల్స్‌ను జేజే హాస్పిటల్స్‌ అని పిలుస్తారు. మొదట్లో మహిళలకు, పిల్లలకు వైద్య సదుపాయం అందించే వార్డు భవనాన్ని తర్వాత కాలంలో కాలేజీగా మార్చారు. ఇది అతి పురాతనమైన వైద్య సంస్థ. ఇందులో బుధవారం 132 ఏళ్ల నాటి సొరంగం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి రహస్య సొరంగాన్ని గుర్తించారు. సాంబా సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి 150 మీటర్ల పొడవున్న రహస్య సొరంగ మార్గాన్ని జవాన్లు కనిపెట్టారు. ఈ విషయాన్ని డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ నిర్ధారించారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న జవాన్లు ఈ సొరంగ మార్గాన్ని గుర్తించారు. భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఆ సొరంగ మార్గాన్ని వినియోగించి ఉంటారని అప్పట్లో జవాన్లు భావించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img