Friday, April 19, 2024
Friday, April 19, 2024

డాలర్‌తో మారకంలో రూ.79.90కి పడిపోయిన రూపాయి

మొత్తంగా దేశానికి దిగుమతుల బిల్లు పెరిగే అవకాశం
ఆరు నెలల్లో 27 సార్లు పతనం

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా రూ.79.90 పైసలకు పడిపోయింది. ముందర నుంచీ రూ.80 వరకు పడిపోవచ్చన్న అంచనాలకు అనుగుణంగానే రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం డాలర్‌ తో మారకం విలువ రూ.79.72 పైసల వద్ద ప్రారంభం కాగా.. ఒక దశలో 79.92 పైసల వరకు పడిపోయింది. చివరికి రూ.79.90 పైసల వద్ద ముగిసింది. నిజానికి చమురు ధరలు తగ్గడం కొంత వరకు రూపాయి పతనాన్ని అడ్డుకున్నాయని, లేకుంటే మరింతగా పడిపోయేదని ఆర్థిక వేత్తలు చెప్తున్నారు. చమురు ధర గురువారం 2.2 శాతం పడిపోయి.. 97.38 డాలర్లకు చేరిందని వివరించారు. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూపాయి 27 సార్లు పతనమైనట్టు ఆర్థిక నిపుణులు తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు డాలర్‌ తో రూపాయి మారకం విలువ రూ.74కు కాస్త అటూ ఇటుగా కొనసాగగా.. ప్రస్తుతం రూ.80కి చేరువలోకి వచ్చింది. అంటే సుమారు 9.1శాతం పడిపోయిందని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img