Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తమిళనాడులో 12 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదు

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ కేసులు 12 నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌ మీడియాకు తెలిపారు. మొత్తం 300 శాంపిళ్లను హైదరాబాద్‌లోని డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, డయాగ్నోస్టిక్‌కు పంపించగా, ఇందులో 12 నమూనాల్లో ఒమిక్రాన్‌ కొత్త సబ్‌ వేరియంట్లు బయటపడ్డాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ఇందులో నలుగురిలో బీఏ.4, మరో 8 మందిలో బీఏ.5 వేరియంట్‌ బయటపడిరదన్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ 12 మంది ఆరోగ్యంగా ఉన్నారని ఎం సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. వీరంతా ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. కొత్త వేరియంట్‌ నమోదైన వారి కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమైనట్లు మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img