Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తమిళ ప్రభుత్వోద్యోగులకు 31శాతం డీఏ

పొంగల్‌ కానుక ప్రకటించిన స్టాలిన్‌

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం తమ ప్రభుత్వ ఉద్యోగులకు పొంగల్‌ కానుకగా 31శాతం కరవు భత్యం (డీఏ) ప్రకటించింది. ఈ నిర్ణయంతో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, కుటుంబ పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఒక ప్రకటన చేశారు. డీఏను 14శాతం పెంచుతున్నామని, ఇది 2022, జనవరి 1వ తేదీ నుంచి అమలు అవుతుందని తెలిపారు. సీ, డీ విభాగపు ఉద్యోగులకు రూ.3వేలు, స్పెషల్‌ పే మాట్రిక్స్‌ కింద వేతనాలు పొందేవారికి రూ.వెయ్యి, పింఛన్‌దారుల (ప్రత్యేక పింఛన్‌దారులతో సహా) కు రూ.500 చొప్పున పొంగల్‌ కానుక ఇస్తామన్నారు. 17శాతం నుంచి 31శాతానికి డీఏను పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజనాపై రూ.8,724 కోట్ల అదనపు భారం పడుతుందని, అలాగే పండుగ ప్రోత్సాహకాల రూపేణ మరో రూ.169.56 కోట్లు భరించాల్సి వస్తుందని అధికారిక ప్రకటన వెల్లడిరచింది. ఆర్థిక భారం ఉన్నాగానీ పండగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పింఛన్‌దారులకు కానుకలు ఇవ్వాలని స్టాలిన్‌ సర్కార్‌ నిర్ణయించిందని తెలిపింది. ప్రస్తుతం పెంచిన డీఏతో 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు లబ్ధి పొందుతారని వెల్లడిరచింది. కాగా, జనవరి 14న పొంగల్‌ను తమిళ ప్రజలు జరుపుకోనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img