Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

తీవ్ర తుఫానుగా మారిన ‘అసని’

ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం దిశగా పయనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ సోమవారం తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం కార్‌ నికోబార్‌ దీవులకు ఉత్తరంగా 710 కిలోమీటర్లు, పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చమ వాయువ్యంగా 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఈశాన్యంగా 670 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి దక్షిణ-ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించి మే 10 నాటికి ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అనంతరం తన దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాపై అసని తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీవ్ర తుఫానుగానే తీరానికి చేరువగా వస్తుందని పేర్కొంది. తుఫాను కారణంగా గంటకు 110 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.అసని తీరానికి చేరువగా వచ్చిన దిశ మార్చుకున్న తర్వాత మే 10 రాత్రి తర్వాత తుఫానుగా.. మే 12 ఉదయం వాయుగుండంగా బలహీపపడుతుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో మంగళ, బుధవారాలు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాన్‌ తీరం దాటేంత వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు మత్స్యకారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img