Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తుపాకీ చేతబట్టి వస్తే తుపాకీతోనే సమాధానం ఇవ్వాలి..: తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యాఖ్యానించారు. అంతర్గత భద్రతకు ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై కొచ్చిలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశంపై మాట్లాడుతూ, తుపాకీ చేతబట్టి వచ్చినవాళ్లకు తుపాకీతోనే సమాధానం చెప్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ తీరును ఆయన ఖండిరచారు. 2008లో ముంబై ఉగ్రదాడులు జరిగిన తర్వాత పాకిస్థాన్‌తో ఇండియా కుదుర్చుకున్న ఉగ్రవాద ఒప్పందాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ ఉగ్రదాడితో దేశం విషాదంలో నిండిపోయిందని, కానీ 9 నెలలు గడవకముందే ఉగ్రవాద బాధితులమని రెండు దేశాల ప్రధానులు సంతకాలు చేసినట్లు గవర్నర్‌ రవి ఆరోపించారు. పాకిస్థాన్‌ మనకు మిత్ర దేశమా లేక శత్రు దేశమా, ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్‌ ఉండకూడదన్నారు.
పుల్వామా దాడి తర్వాత పాక్‌లోని బాలాకోట్‌పై జరిగిన సర్జికల్‌ దాడిని గవర్నర్‌ రవి మెచ్చుకున్నారు. ఎవరైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గవర్నర్‌ రవి తెలిపారు. మన్మోహన్‌ పాలనతో పోలిస్తే ఇప్పుడు అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని అన్నారు. మన్మోహన్‌ పాలన సమయంలో మావో తీవ్రవాదుల హింస 185 జిల్లాల్లో ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాలకు తగ్గినట్లు ఆయన వెల్లడిరచారు.
కశ్మీర్‌ అంశంపై మాట్లాడుతూ ప్రజలు సహకరించడం వల్లే ఉగ్రవాద నిర్మూలన సాధ్యం అవుతోందని గవర్నర్‌ రవి తెలిపారు. హింస పట్ల జీరో టాలరెన్స్‌ ఉందని, ఎవరైనా గన్‌ వాడితే వాళ్లకు ఆ గన్‌తోనే సమాధానం ఇవ్వాలని, దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడేవారితో చర్చలు ఉండవని గవర్నర్‌ రవి తెలిపారు. గడిచిన 8 ఏళ్లలో ఎటువంటి సాయుధ గ్రూపుతో చర్చలు నిర్వహించలేదని ఆయన వెల్లడిరచారు. మావో ప్రాంతాల్లోని వాళ్లకు ప్రత్యేక ఐడియాలజీ ఉంటుందని, వాళ్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మరని, అయితే తాము దాన్ని అంగీకరించబోమని, ఇక వాళ్లతో చర్చలు అవసరం లేదని గవర్నర్‌ రవి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img