Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

త్వరలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ : ప్రధాని మోదీ

ఆధునిక మౌలిక సదుపాయాల వల్ల ఉత్తరప్రదేశ్‌ త్వరలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొన్నారు.భవిష్యత్తు తరం మౌలిక సదుపాయాలతో అత్యాధునిక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్‌ గుర్తింపు పొందడం ఎంతో దూరంలో లేదని అన్నారు. రాష్ట్రంలోని ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్‌, నిర్మితమవుతున్న నూతన విమానాశ్రయాలు, రైలు మార్గాలు ప్రజలకు అనేక వరాలను తీసుకొస్తున్నాయని చెప్పారు. 600 కిలోమీటర్ల నిడివిగల ఈ ఎక్స్‌ప్రెస్‌వే కోసం రూ.36,000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని అన్నారు. వేలాది మంది యువతీయువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. అంతేకాకుండా సరికొత్త అవకాశాలు కూడా చేరువవుతాయని చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చెప్పారు. ప్రజాధనం గతంలో ఎలా దుర్వినియోగమయ్యేదో అందరూ చూశారని, పాలకులు భారీ ప్రాజెక్టులను పేపర్లకు పరిమితం చేసి సొంత ఖజానా నింపుకునే వారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img