Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దక్షిణ బెంగాల్‌లో వానలే వానలు…

కోల్‌కతా : దక్షిణ బెంగాల్‌ను వానలు ముంచెత్తుతున్నాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రికార్డు స్థాయిలో కురిసన వర్షానికి మెట్రోపాలిస్‌లోని అనేక లోతట్లు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం బుధవారం ఉదయం దక్షిణ బెంగాల్‌ను ముంచెత్తుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ 24 పరగాణాలు, పూర్బ మెడ్నీపూర్‌, పశ్చిమ్‌ మెడ్నీపూర్‌లో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. 24 గంటల్లో కోల్‌కతాలో 142 ఎంఎంల వర్షపాతం నమోదు కాగా 2007 తర్వాత ఇంతటి వర్షం కురవలేదని వాతావరణ శాఖ తెలిపింది. సోనర్పూర్‌, బర్యూపూర్‌, మెడ్నీపూర్‌, హల్దియా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగాళఖాతం తీరంలోని సాగర్‌ ద్వీపంలో మంగళవారం ఉదయం వరకు 212.8 ఎంఎంల వర్షపాతం నమోదు కాగా డమ్‌డమ్‌లో 134 ఎంఎం, సాల్ట్‌లేక్‌లో 118.2ఎంఎం, కానింగ్‌లో 115ఎంఎం, డైమండ్‌ హార్బర్‌లో 105 ఎంఎం, బరాక్‌పూర్‌లో 102 ఎంఎంల చొప్పున వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img