Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దిల్లీలో భారీ వర్షాలు


ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు దిల్లీని తాకాయి. దిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దిల్లీకి సమీపంలోని ఎన్సీఆర్‌, గోహనా, సోనిపట్‌, రోహతక్‌, కేక్రా ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దిల్లీకి ఆలస్యంగా చేరడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి.సఫ్దర్‌జంగ్‌ ఏరియాలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిముషాల మధ్యలో 2.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రెండు మూడు రోజులుగా వర్ష సూచనలు ఉన్నప్పటికీ రుతుపవనాల ప్రారంభం కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని, గత రెండ్రోజులుగా దిల్లీ మినహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ పేర్కొంది. దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img