Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,126 కేసులు నమోదయ్యాయి. 266 రోజుల తర్వాత కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం వెల్లడిరచింది. కరోనాతో 332 మంది మరణించినట్లు వెల్లడిరచారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 11,982 మంది కోలుకున్నట్లు తెలియజేశారు.ఈ క్రమంలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుం భారత్‌లో కరోనా రికవరీ రేటు 98.25 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 263 రోజుల కనిష్టానికి చేరింది.. ప్రస్తుతం 1,40,638 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,77,113 కి చేరగా.. మరణాల సంఖ్య 4,61,389 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది..కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,09,08,16,356 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. నిన్న దేశవ్యాప్తంగా 59,08,440 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img