Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు


దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,32,342 మందికి పరీక్షలు చేయగా.. 37,154 మందికి కరోనా పాజిటవ్‌గా నిర్థారణ అ్యంది. 724 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. కరోనా రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 4,08,764 మంది చనిపోయారు.దీంతో మొత్తం మరణాలు 4,08,764కి చేరాయి. నిన్న 39,649 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తంగా దేశంలో 3 కోట్ల 14 వేల 713 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దేశంలో ప్రస్తుతం 4,50,899 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,08,74,376. ే ఇటీవల కాలంలో కొత్త కేసులు, రికవరీల మధ్య గ్యాప్‌ తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి ఇంకా ముగియలేదని.. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో 12,35,287 మంది టీకాలు వేయించుకున్నారు.ఫలితంగా దేశంలో ఇప్పటివరకు 37,73,52,501 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img