Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 7,584 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళ కలిగిస్తోంది. వరుసగా రెండోరోజూ 7 వేలకుపైగా నమోదయ్యాయి. గురువారం 7240 కేసులు నమోదవ్వగా, శుక్రవారం మరో 7,584 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,05,106కు చేరాయి. ఇందులో 4,26,44,092 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 36,267 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 5,24,747 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 24 మంది కరోనాకు బలవగా, 3,791 మంది కోలుకున్నారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో 8,813 మందికి పాజిటివ్‌ వచ్చింది. కేరళలో 2193, ఢల్లీిలో 622, కర్ణాటకలో 471, హర్యానాలో 348 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా, మొత్తం కేసుల్లో 0.08 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,94,76,42,992 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img