Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో పెరిగిన అసమానతలు

రోడ్లపాలైన అన్నదాతలు
మోదీది రాచరిక పాలన
రాహుల్‌ గాంధీ ధ్వజం
ఉధమ్‌ సింగ్‌నగర్‌ :
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని మోదీ రైతులను రోడ్డు పాలు చేశారని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఉత్తరాఖండ్‌లోని ఉద్దమ్‌సింగ్‌నగర్‌లోని కిచ్చాలో జరిగిన పార్టీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కోవిడ్‌`19 విపత్కర పరస్థితుల మధ్య సాగు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్లు ఎక్కిన రైతులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆయన ప్రధాని మంత్రిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. తన నిర్ణయాలను ప్రశ్నించకూడదు అనే తరహా మనస్తత్వం ఉన్న వ్యక్తి అని మండిపడ్డారు. సాగు చట్టాల రూపకల్పనలో ఇలాగే వ్యవహరించారని పేర్కొన్నారు. అన్నదాతల పోరాటాన్ని లెక్కచేయకుండా కరోనా విపత్కర పరిస్థితిల్లో రోడ్ల పాలు చేశారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్‌ ఇలా వ్యవహరించలేదని చెప్పారు. మోదీ తరహాలో ఎన్నటికీ కాంగ్రెస్‌ వ్యవహరించదని నొక్కి చెప్పారు. తాము రైతులు, పేదలు, కార్మికులతో సహా అన్ని వర్గాల భాగస్వామ్యంతో పని చేయాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. సాగు చట్టాల విషయంలో పట్టువిడవకుండా పోరాటం చేసిన రైతులను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. మొండి ప్రభుత్వం మెడలు వంచి చట్టాల రద్దు చేయించుకోవడంపై ప్రశంసలు కురిపించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అమరులైన అన్నదాతల కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ పాలన తీరుపై ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో రెండు దేశాలుగా భారత్‌ విడిపడిరదని మరోసారి వ్యాఖ్యానించారు. ఒకటి పేదల దేశంగా మిగిలితే మరోటి సంపన్నుల దేశంగా మారిందని వివరించారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరగడమే దీనికి కారణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అనుకూల విధానాలతోనే ముందుకు నడుస్తుందని మోదీ తరహా నియంతృత్వాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతోనే పాలన ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటుందని తెలిపారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
చదువులకు హిజాబ్‌ అడ్డుకారాదు
ఆడపిల్లల చదువుకు హిజాబ్‌ అడ్డుకాకూడదని రాహుల్‌ గాంధీ అన్నారు. హిజాబ్‌ పేరుతో బీజేపీ ముస్లిం విద్యార్థినుల భవిష్యత్తును అడ్డుకుంటోందని విమర్శించారు.
కర్ణాటకలోని విద్యా సంస్థల్లోకి హిజాబ్‌ ధరించిన విద్యార్థినులకు ప్రవేశం నిషేదం విధించడాన్ని తప్పుబట్టారు. చదువుల తల్లి సరస్వతీ విద్యార్థుల మధ్య భేదం చూపదని అందరికీ జ్ఞానాన్ని అందిస్తుందని వసంత పంచమి సందర్భంగా ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img