Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మూడు వేల పైనే కరోనా కొత్త కేసులు


దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 3,377 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి. ఇందులో 4,25,30,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 5,23,753 మంది మృతిచెందగా, 17,801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2496 మంది కరోనా నుంచి కోలుకోగా, 60 మంది మరణించారు. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం ఢల్లోినే ఉన్నాయి. దేశరాజధానిలో నిన్న ఒక్కరోజే 1490 కరోనా కేసులు రికార్డయ్యాయి.కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.04 శాతం ఉన్నాయని, 98.74 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, 1.22 శాతం మంది మరణించారని తెలిపింది. ఇప్పటివరకు 1,88,65,46,894 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో గురువారం ఒక్కరోజే 22,80,743 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img