Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశాల మధ్య సహకారం మరింత పెరగాలి : ప్రధాని మోదీ

కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం సంక్షోభం ఏర్పడిరదని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు అనుసంధానతను సాధించేందుకు మెరుగైన సరఫరా కలిగి ఉండాలని సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సు (ఎస్‌సిఒ) లో శుక్రవారం మోడీ సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగించారు. సభ్య దేశాల మధ్య సహకారానికి, పరస్పర విశ్వాసానికి భారత్‌ మద్దతునిస్తుందని అన్నారు. ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా, చౌకగా లభించే చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు భారత్‌ కృషి చేస్తోందని అన్నారు. సాంప్రదాయక వైద్యంలో కూడా సభ్య దేశాలు సహకరించాలని కోరారు. ప్రజాభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న వినియోగంపై దృష్టి సారించామని, ఎస్‌సిఒ దేశాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img