Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దేశ్‌ముఖ్‌పై మరిన్ని ఆధారాల్లేవ్‌..

విచారణ కమిషన్‌కు పరమ్‌ బీర్‌ సింగ్‌ వెల్లడి
ముంబై : మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపే కమిషన్‌ ముందు ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ అఫిడవిట్‌ సమర్పించారు. ఈ విషయంలో పంచుకోవడానికి తన వద్ద ఇంతకు మించి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశాడు. కమిషన్‌ మునుపటి విచారణలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అఫిడవిట్‌ సమర్పించారని సింగ్‌ తరఫు న్యాయవాది బుధవారం ధ్రువీకరించారు. ఈ ఏడాది మార్చిలో దేశ్‌ముఖ్‌పై పరమ్‌ బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ జస్టిస్‌ కైలాష్‌ ఉత్తమ్‌చంద్‌ చండీవాల్‌తో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సింగ్‌కు కమిషన్‌ అనేకసార్లు సమన్లు, బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినప్పటికీ, ఆయన ఇప్పటివరకు కమిషన్‌ ఎదుట హాజరుకాలేదు. విచారణకు హాజరుకాని కారణంగా, కమిషన్‌ సింగ్‌కు జూన్‌లో రూ.5 వేలు, మరో రెండు సందర్భాలలో రూ.25 వేలు చొప్పున మూడుసార్లు జరిమానా విధించింది. అయితే తాజా పరిణామంపై ఈ కేసులో విచారణ కమిషన్‌ తరఫున హాజరైన ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శిశిర్‌ హిరే మాట్లాడుతూ ాపరమ్‌ బీర్‌ సింగ్‌ ఈ విషయంలో మొదట ముఖ్యమంత్రికి, హోం మంత్రికి పంపిన లేఖ తప్ప మరే ఇతర సాక్ష్యాలను ఇవ్వడానికి నిరాకరించాడు. ఆయన్ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు కూడా సిద్ధంగా లేడు్ణ అని చెప్పాడు. గత వారం స్థానిక పోలీస్‌ స్టేషన్లలో నమోదయిన వివిధ దోపిడీ కేసులకు సంబంధించి ముంబై, పొరుగున ఉన్న థానే జిల్లాలో సింగ్‌పై రెండు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ ఏడాది మార్చిలో తనను ముంబై పోలీసు కమిషనర్‌గా తొలగించి, హోం గార్డులకు బదిలీ చేసిన కొన్ని రోజుల తర్వాత, ముంబైలోని రెస్టారెంట్‌, బార్‌ యజమానుల నుండి డబ్బు వసూలు చేయమని దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులను అడిగేవాడని పరమ్‌ బీర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. దేశ్‌ముఖ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎన్సీపీ నేత పదే పదే ఖండిరచారు. దేశ్‌ముఖ్‌పై సింగ్‌ చేసిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. దేశ్‌ముఖ్‌ను మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ సోమవారం అరెస్టు చేసింది. నవంబర్‌ 6 వరకు కస్టడీకి పంపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img