Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశ రాజకీయాల్లో పరివర్తనం కనిపిస్తోంది.. : ములాయం సింగ్‌

లక్నోలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

లక్నో : రాజకీయ పరివర్తనానికి దేశం సాక్షిగా ఉందని, దీనిని ఉత్సాహవంతులైన యువతీయువకులు విజయపథంలో ముందుకు తీసుకువెళ్లాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు. తన 82వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. మలాయంకు రాంగోపాల్‌ యాదవ్‌తో సహా పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న విక్రమాదిత్య మార్గ్‌లో ములాయం సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బానర్లను పార్టీవారు ఏర్పాటు చేశారు. వేడుకను ఘనంగా నిర్వహించారు. 83కేజీల కేకు, అంతే బరువు ఉన్న లడ్డూను అఖిలేశ్‌తో కలిసి ములాయం కట్‌ చేశారు. ఆపై మాట్టాడుతూ ‘మీరు నా పుట్టినరోజును జరుపుతుండటం సంతోషమేగానీ ఇలా ప్రతి పేదోడి పుట్టినరోజు జరగాలి.. మీరు అలా చేయండి. వేడుకకు నన్ను ఆహ్వానించండి.. తప్పక వస్తాను’ అని ములాయం అన్నారు. పార్టీవారికి ఆశీర్వచనాలు ఇవ్వాలని అఖిలేశ్‌ కోరగా ములాయం ఆచరించారు. కార్యక్రమానికి ములాయం సోదరుడు, ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్‌ యాదవ్‌ రాలేదని ఎస్పీ నేత తెలిపారు. శివపాల్‌ సైఫైలో ఉన్నారని, అక్కడ కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారని, ములాయం పుట్టినరోజు సందర్భంగా ఈ పోటీలు ప్రతి సంవత్సరం జరుగుతాయని చెప్పారు. ములాయం పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్రంలో పండ్లు, వస్త్రాలు పంచినట్లు ఎస్పీ యూపీ అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌ తెలిపారు. ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ సోమవారం ములాయం ఇంటికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మసూద్‌ అహ్మద్‌, పార్టీ అధికార ప్రతినిధి అనిల్‌ దూబే ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ములాయం సింగ్‌ 1939, నవంబరు 22న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని సైఫై గ్రామంలో జన్మించారు. 1967తో తొలిసారి రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అంతకుముందు వరకు ఆయన టీచర్‌గా పనిచేశారు. 198991Ñ 199395Ñ 2003`07లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1996 నుంచి 1998 వరకు యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img