Friday, April 19, 2024
Friday, April 19, 2024

ద్రవ్యోల్బణం కట్టడికి సరైన సమయంలోనే స్పందించాం

ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌
ముంబై: దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో సరైన సమయంలోనే స్పందించామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో ఏమాత్రం తొందరపడినా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడేదని చెప్పుకొచ్చారు. ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన మోడరన్‌ బీఎఫ్‌ఎస్‌ఐ సదస్సు`సమ్మిట్‌ 2022లో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా ఆర్బీఐ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటునే వుందన్నారు. వృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ చర్చలు తీసుకుందని చెప్పారు. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ ముడి చమురు ధర 80 డాలర్లుగా లెక్కలోకి తీసుకునే ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతంగా అంచనా వేసినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. మరోవైపు ఆర్థిక రంగంలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు ప్రవేశించడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఆయా సంస్థలు తమ సొంతంగా లేదా భాగస్వామ్యాల ద్వారా ఆర్థిక సేవల్ని అందిస్తున్నాయని, దీనివల్ల పరపతి అంచనాకు కొత్త విధానాలను అనుసరించాల్సి వస్తోందన్నారు. ఇక రుణాల రికవరీకి కఠిన పద్ధతుల్ని అవలంబించడాన్ని దాస్‌ తప్పు బట్టారు. ఇష్టం వచ్చినసమయంలో కాల్‌ చేసి, అభ్యంతరకర భాషను ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదన్నారు. వీటిని అరికట్టడంపై ఆర్బీఐ దృష్టి సారించినట్లు తెలిపారు. డిజిటల్‌ రుణాలను సురక్షితంగా, పటిష్ఠంగా చేయడానికి ఆర్బీఐ త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img