Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ధరల పెంపుపై లోక్‌సభ సభ్యుల వాకౌట్‌

న్యూదిల్లీ : పార్లమెంటు సమావేశాలు రసాభాస అవుతూనే ఉన్నాయి. పెరిగిన ఇంధనం ధరలపై ప్రతిపక్షాలు శుక్రవారం సభలో నిరసన తెలిపి అనంతరం వాకౌట్‌ చేశాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన 137 రోజులకు పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచడంపై కేంద్రాన్ని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ ప్రశ్నించారు. జీరో అవర్‌లో ఆయన ఈ ప్రశ్నను లేవనెత్తారు. కోవిడ్‌ అనంతరం పరిస్థితులు మెరుగైనా ద్రవ్యోల్బణం అస్థిరంగా ఉండటాన్ని ప్రస్తావించారు. ప్రజలకు కాస్తంత ఊరట కల్పించండి, వారిని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనివ్వండి. ఇలా ధరాభారాలు మోపకండి అంటూ వ్యాఖ్యానించారు. ఇంధనం ధరలు వారంలో మూడు సార్లు పెంచడం ఎందుకని ప్రశ్నించారు. గతేడాది డిసెంబరు నుంచి రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఘర్షణ సాగుతోందని, ధరల పెంపుకు దానిపై నెపం నెట్టడం తగదన్నారు. ‘భారతీయులు ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్‌ దెబ్బ నుంచి కోలుకుంటున్నారు. ఇంకెన్ని ధరాభారాలను వీరు మోయాల్సి ఉంటుందో తెలియదు. ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని వారు కోరుకుంటున్నారుగానీ ధరల పెంపుతో వ్యాపారం ఖరీదుగా మారింది. ముఖ్యంగా రవాణా ఖర్చు పెరగడం ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది’ అని గొగోయ్‌ అన్నారు. మిగతా ప్రతిపక్ష సభ్యులు కూడా ఇదే వ్యవహారంలో సభకు హాజరైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నుంచి స్పందనను కోరారు. కానీ అలా జరగని పక్షంలో కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్‌సీపీ, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్‌ సభ్యులంతా తమ నిరసనను వ్యక్తంచేసేందుకు వాకౌట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img