Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నాకు సోదరీమణులు ఉన్నారు…

విమర్శకులకు ప్రియాంక గాంధీ సినిమా డైలాగ్‌తో కౌంటర్‌
లక్నో : కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ‘మేరే పాస్‌ బెహెన్‌ హై’ (నాకు సోదరి ఉంది) అంటూ, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల బరిలోకి దిగిన విమర్శకులను ఎదుర్కోవడానికి బాలీవుడ్‌ చిత్రం ‘దీవార్‌’లోని ప్రజాదరణ పొందిన డైలాగ్‌ను గుర్తు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎటువంటి ఆధారం లేనందున కాంగ్రెస్‌ తన ర్యాలీలలో మహిళల గురించి మాట్లాడుతోందని ప్రత్యర్థి పార్టీలు చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు ఆమె ప్రతిస్పందనను కోరగా, దీనికి అమితాబ్‌ బచ్చన్‌, శశి కపూర్‌ సోదరులుగా నటించిన ‘దీవార్‌’ సినిమా డైలాగ్‌ విన్నారా అని ప్రియాంక ఆ జర్నలిస్టును అడిగిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి తన ట్విట్టర్‌ అప్‌లోడ్‌ చేశారు. ‘అమితాబ్‌ శశికపూర్‌తో.. ‘మేరే పాస్‌ గాడీ హై, మేరే పాస్‌ బంగ్లా హై, యే హై, వో హై, తో శశి కపూర్‌ నే కహా, మేరే పాస్‌ మా హై (నాకు కారు ఉంది, నాకు బంగ్లా ఉంది… శశి కపూర్‌ చెబుతూ, నాకు తల్లి ఉంది) అంటూ ప్రియాంక ఉత్తర ప్రదేశ్‌లోని మహిళల గురించి స్పష్టమైన ప్రస్తావన తీసుకువస్తూ, ‘నాకు అక్కచెల్లెళ్లు ఉన్నారు.. అక్కలు రాజకీయాల్లో మార్పు తెస్తారు. ‘లడ్కీ హూన్‌ లడ్‌ శక్తి హూన్‌’ అంటూ హిందీలో ఆమె ట్వీట్‌ చేసింది. 2022 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. మహిళా సాధికారతపై ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ప్రధాని కార్యక్రమం మోదీ తమ ముందు తలవంచిందని, సోదరీమణుల ఐక్యత విప్లవానికి నాంది పలుకుతుందని మంగళవారం ప్రియాంక అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్న ప్రియాంక గతంలో ‘శక్తి విధాన్‌’ పేరుతో మహిళల కోసం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img