హాజరైన కేజ్రీవాల్, రాఘవ్ చద్దా
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. హర్యానాకు చెందిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. ఈ పెళ్లికి మాన్ తల్లి, సోదరి అతికొద్దిమంది కుటుంబ సభ్యులతోపాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా హాజరయ్యారు.పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్ మాన్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్లో పోస్టు చేశారు.