Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నెట్‌ఫ్లిక్స్‌కు మళ్లీ దెబ్బ.. భారీ సంఖ్యలో యూజర్ల తగ్గుదల

ఓటీటీ రంగంలో చాలా సంవత్సరాలు కింగ్‌గా కొనసాగిన నెట్‌ఫ్లిక్స్‌కు ప్రస్తుతం కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం తొలి క్వార్టర్‌లో ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. మరోసారి ఎదురుగాలి వీచింది. క్రమంగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీడుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌, జూన్‌ మధ్య సుమారు 1 మిలియన్‌ (10 లక్షలు) సబ్‌స్క్రైబర్లను ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోల్పోయింది. ఆదాయంపై ప్రభావం పడేందుకు ఓ కారణం బలంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌, ఆగస్టు నెలల మధ్య 9,70,000 సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్టు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. అయితే తాము అనుకున్న దాని కంటే ఈ సంఖ్య తక్కువేనని నెట్‌ఫ్లిక్స్‌ చెబుతోంది. నిష్క్రమిస్తున్న యూజర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో రీడ్‌ హ్యాస్టింగ్స్‌ చెప్పారు. వెబ్‌సిరీస్‌లకు చెందిన కొత్త సిరీస్‌లు హిట్‌ అవడంతో సబ్‌స్క్రైబర్ల తగ్గుదల నెమ్మదిగా ఉందని అభిప్రాయపడ్డారు. 2011 తర్వాత తొలిసారి ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో యూజర్లను కోల్పోయింది నెట్‌ఫ్లిక్స్‌. రెండో త్రైమాసికంలోనూ 20లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోతామని అంచనాను ప్రకటించింది. అయితే ఇప్పటికే దాదాపు మిలియన్‌ యూజర్లను చేజార్చుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img