Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నెలవారీ రిటర్న్‌ దాఖలు చేయకపోతే జీఎస్‌టీఆర్‌-1 దాఖలు నిషేధం

వచ్చే జనవరి 1 నుంచి అమలు

న్యూదిల్లీ : నెలవారీ జీఎస్‌టీ చెల్లించడంలో విఫలమైన వారు వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి జీఎస్‌టీఆర్‌1 అమ్మకాల రిటర్న్‌ దాఖలు చేయడంపై జీఎస్‌టీ మండలి నిషేధం విధించింది. సెప్టెంబరు 17న లక్నో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో రీఫండ్‌ క్లెయిమ్‌లు దాఖలు చేయడానికి తప్పనిసరి ఆధార్‌ ధ్రువీకరణతో సహా సమ్మతిని క్రమబద్ధీకరించడానికి అనేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. జులై 1, 2017 నుంచి అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) ఎగవేత కారణంగా ఆదాయ నష్టాలను నివారించేందుకు ఈ చర్య సహాయపడుతుంది. ఒక నమోదు వ్యక్తి గత నెలలో జీఎస్‌టీఆర్‌3బీ ఫారమ్‌లో రిటర్న్‌ ఇవ్వకపోతే జీఎస్‌టీఆర్‌1 ఫారం దాఖలును అనుమతించకుండా కేంద్ర జీఎస్‌టీ నిబంధనలకు చెందిన 59(6) నిబంధనను జనవరి 1, 2022 నుంచి సవరించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. ప్రస్తుతం వ్యాపారం రెండు నెలల క్రితం జీఎస్‌టీఆర్‌3బీ దాఖలు చేయడంలో విఫలమైత, జీఎస్‌టీఆర్‌1 దాఖలు చేయడాన్ని పరిమితం చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ రద్దు ఉపసంహరణ కోసం దరఖాస్తు, రిఫండ్‌ క్లెయిమ్‌ దాఖలుకు అర్హత కోసం ఆధార్‌ ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీఐసీ) జీఎస్‌టీ నమోదుకు ఆధార్‌ ప్రామాణీకరణ ఆగస్టు 21, 2020 నుంచి అమలులోకి వచ్చేలా నోటిఫై చేసింది. ఒకవేళ వ్యాపారులు తమ ఆధార్‌ నంబరు ఇవ్వకపోతే, వ్యాపార స్థలాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే జీఎస్‌టీ నమోదు చేస్తారు. వ్యాపారులు ఇప్పుడు పన్ను రిఫండ్‌ క్లెయిమ్‌ల కోసం ఆధార్‌ బయోమెట్రిక్‌తో తమ జీఎస్‌టీ నమోదును అనుసంధానించాల్సి ఉంటుందని, అలాగే రిజిస్ట్రేషన్‌ రద్దు ఉపసంహరణకు కూడా ఇది వర్తించేలా జీఎస్‌టీ మండలి ప్రస్తుతం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img