Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నేటి నుంచే పార్లమెంట్‌ సమావేశాలు

నేటి నుండి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో..ఎంపీలు పార్లమెంట్‌ ప్రాంగణంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సమావేశాల నిర్వహణ..అజెండా పైన స్పీకర్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాలు ఏ అంశం పైన అయినా సరైన విధానంలో చర్చకు వస్తే తాము సిద్దంగా ఉన్నామని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
అగ్నిపథ్‌ పై సమావేశాల్లో చర్చ
త్రివిధ దళాల్లో తాత్కాలిక నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్‌ పథకం, ఆర్థికవ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తాలని విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. వివిధ శాఖలు 32 బిల్లులను సూచించినట్లు కేంద్రం వెల్లడిరచింది. వీటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అగ్నిపథ్‌ పైన చర్చకు సిద్దమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న అటవీ హక్కుల చట్టం-2006 సవరణ బిల్లుపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గుర్తుచేశారు.ఇక అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక విషయంలో భారత్‌ జోక్యం చేసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు డిమాండ్‌ చేశాయి. లంకలోని తమిళుల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక సంక్షోభంపై మంగళవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్‌ జోషీ వెల్లడిరచారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే 32 బిల్లుల జాబితాను కేంద్రం సమావేశంలో సభ్యులకు అందించింది. ఇక, ఈ సమావేశాల్లోనే నూతన రాష్ట్రపతి ఎన్నిక – ప్రమాణ స్వీకారం..అదే విధంగా ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నాయి. దీంతో..ఈ సమావేశాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img