Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేపాల్‌ లో భారీ భూకంపం.. తీవ్రత 5.2గా నమోదు

నేపాల్‌ లో భారీ భూకంపం సంభవించింది. నేపాల్‌ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 5.2 గా నమోదైంది. నేపాల్‌ లోని మౌంట్‌ రోడ్‌, వైట్స్‌ రోడ్‌ లో భూమి కంపించింది. భూమి కదిలిపోతున్న ఫీలింగ్‌తో.. స్థానికులంతా భయాందోళన చెందారు. ఇళ్లలోని పాత్రలన్నీ షేకవుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఈరోజు మూడు ప్రాంతాల్లో భూకంపం చోటుచేసుకుంది.ముందుగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత దేశ రాజధాని ఢల్లీిలో భూకంపం వచ్చింది. తీవ్రత 3.2గా నమోదైంది. తాజాగా నేపాల్‌ లో భూకంపం చోటుచేసుకుంది. వరుసగా పలు ప్రాంతాల్లో భూకంపాలు రావడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ టర్కీ, సిరియాలో చోటుచేసుకున్న భూకంపాలతో 40వేలకు పైగా ప్రజలు చనిపోయిన ఘటన మరువక ముందే.. మన దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img