Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పంజాబ్‌ సీఎం మాన్‌ దూకుడు

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ఓకే
చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ దూకుడు పెంచారు. హామీల అమలుపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 35 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను తమ ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందని మాన్‌ మంగళవారం ప్రకటించారు. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీలకు సంబంధించి 35 వేల కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు మాన్‌ ఓ వీడియో సందేశంలో ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకు ముందు తమ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టుల భర్తీకి మాన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img