Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పరీక్షా కేంద్రంలో అమ్మాయిల్ని చూడగానే షాక్‌.. స్పృహకోల్పోయిన ఇంటర్‌ విద్యార్థి

పరీక్షా కేంద్రంలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలను చూసి.. ఓ విద్యార్ధి సొమ్మసిల్లి పడిపోయిన విచిత్ర ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. బిహార్‌లో బుధవారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నలందా జిల్లాలో ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి.. తన చుట్టూ విద్యార్థినులే ఉండట చూసి హాల్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఇన్విజిలేటర్లు, సిబ్బంది హుటాహుటిన అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కొద్ది గంటల తర్వాత అతడు కోలుకోవడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. సుందర్‌గఢ్‌కు చెందిన మనీశ్‌ శంకర్‌ (17) అనే విద్యార్థి స్థానిక అల్లామా ఇక్బాల్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. పరీక్షలు ప్రారంభం కావడంతో సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో పరీక్ష రాయడానికి బుధవారం వెళ్లాడు. మనీశ్‌ను అతడి తండ్రి సచ్చిదానంద్‌ ప్రసాద్‌ తీసుకెళ్లి దింపాడు. షెడ్యూల్‌ ప్రకారం గణితం పరీక్ష జరగనుండగా.. రాసేందుకు మనీశ్‌ హాల్‌లోకి వెళ్లాడు. పరీక్ష హాల్‌లో అందరూ బాలికలే ఉండటంతో ఆవిద్యార్థి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయాడు. అందరూ అమ్మాయిలు ఉండటం తాను ఒక్కడ్నే అబ్బాయి కావడంతో అంత మంది విద్యార్థినులను చూడగానే మనీశ్‌ కంగారుపడి సొమ్మసిల్లి పడిపోయాడని అతడి మేనత్త వెల్లడిరచారు.చుట్టూ అమ్మాయిలే ఉండటం వల్ల మనీశ్‌ ఆందోళనకు గురయినట్టు తెలిపారు. ‘‘బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌పరీక్షా కేంద్రంలో 500 మందికి కంటే ఎక్కువ మంది విద్యార్ధినులు ఉన్నారు.. నా మేనల్లుడికి ఆ పాఠశాలలోని మెయిన్‌ హాల్‌లో సీటు కేటాయించారు.. అక్కడ అందరూ విద్యార్ధినులే ఉన్నారు.. అంత మంది అమ్మాయిల్ని చూడగానే ఒంటరిగా ఫీలయి స్పృహ కోల్పోయాడు’’ అని ఆమె అన్నారు. అంతేకాదు, అంత మంది అమ్మాయిలు మధ్య ఒక్కడే అబ్బాయికి పరీక్ష కేంద్రాన్ని ఇంటర్‌ బోర్డు కేటాయించడం ఏంటని? మరో బంధువు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img