Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : ఐఎండీ

రానున్న 24గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒడిశా..అండమాన్‌ నికోబార్‌ దీవులు.. నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మరో ఐదు రోజుల పాటు హెచ్చరికను విడుదల చేసింది.ఈ సమయంలో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి అరేబియా సముద్రం, సోమాలియా తీరం, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరం, ఆగ్నేయ, దానిని ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి అరేబియా సముద్రం మీదుగా గంటకు 45-55 కి.మీ నుండి 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు బయటకు వెళ్లవద్దని ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img