Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. : ఐఎండీ


రుతుపవనాలు సాధారణ తేదీ జూన్‌ 1 కంటే మూడు రోజుల ముందుగానే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి..కేరళ, కర్ణాటక, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగనున్నాయి.మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. కేరళలో శనివారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సోమవారం దిల్లీ నగరంలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారి తెలిపారు.ఉత్తరాఖండ్‌లోని వివిధ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షం, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్‌, చమోలి, బాగేశ్వర్‌, పితోర్‌గఢ్‌ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.జమ్మూ కాశ్మీర్‌లో వచ్చే 24 గంటల్లో పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం,ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img